జేసీ వర్సెస్ కాకర్ల.. తాడిపత్రి టీడీపీలో భగ్గుమన్న విబేధాలు

-

జేసీ వర్సెస్ కాకర్ల.. తాడిపత్రి టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. సీఎం చంద్ర‌బాబు నాయుడు అనంత‌పురం పర్యటనకు తాడిప‌త్రి నుంచి జేసీ ఫోటో ఉన్న వాహనాలే వెళ్లాలని హెచ్చరికలు జారీ అయ్యాయ‌ని చెబుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోటో లేని వాహనాలు ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇస్తున్నార‌ట‌. దీనికి సంబంధించిన నిర్దేశిత ఫార్మాట్, ఆడియో ను విడుదల చేసింది జేసీ వర్గం.

JC vs. Kakarla Tadipatri, differences in TDP are raging
JC vs. Kakarla Tadipatri, differences in TDP are raging

సుమారు వంద వాహనాల్లో చంద్రబాబు సభకు వెళ్లాలని టీడీపీ నేత కాకర్ల రంగనాథ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే.. జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి బెదిరింపుల ఆడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది ఇలా ఉండ‌గా…ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో… భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అధికారంలోకి వచ్చిన అనంతరం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం… ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ తొలిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news