మల్టీ మిలియనీర్ అనంత్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముకేశ్ అంబానీ కుమారుడిగా అనంత అంబానీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అనంత్ అంబానీ ఎన్నో రకాల బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ భారీగా డబ్బులను సంపాదిస్తారు. అదే విధంగా అనంత్ అంబానీ ఎన్నో రకాల మంచి పనులను చేస్తూనే ఉంటాడు. పేదలకు సహాయం చేయడం లాంటి పనులు ఎన్నోసార్లు చేశాడు. మరోసారి అనంత్ అంబానీ తన గొప్ప మనసును చాటుకున్నాడు.

పంజాబ్ వరదలలో అన్ని కోల్పోయిన ప్రజలకు సహాయం చేసేందుకు అనంత్ ముందుకు వచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్, వనతార ఫౌండేషన్ ద్వారా పదివేల కుటుంబాలకు పోషకాహారంతో కూడిన రేషన్ కిట్ లను అందించారు. ఒంటరి మహిళలు, వృద్ధులు ఉంటే వారికి రూ. 5 వేల సహాయం చేశారు. అలాగే పశువులకు వైద్యాన్ని అందించి మెడిసిన్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి భోజనం అందిస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారు. అనంత్ అంబానీ గొప్ప మనసును చూసి ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమైన శ్రీమంతుడు అని కామెంట్లు చేస్తున్నారు.