శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ : సీఎం రేవంత్ రెడ్డి

-

శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు ప్లాన్‌ చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి….తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలని సూచించారు.

revanth
revanth

ఇందుకోసం భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను అధికారులకు వివరించారు. భవిష్యత్అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వేలైన్స్ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్నీ పరిశీలించాలన్న సీఎం రేవంత్ … ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ తో పోలిస్తే కొత్త లైన్ తో దూరం కూడా తగ్గుతుంద‌ని ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news