కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. గూగుల్ నావిగేషన్ తప్పుగా చూపించడంతో కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ వీరిని అదుపులోకి తీసుకుంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ నలుగురిని ఇటీవలే విడుదల చేసింది. దీంతో జాలర్లు మరో రెండు రోజుల్లో సముద్ర మార్గం ద్వారా కాకినాడకు చేరుకోనున్నారు. దీంతో మత్స్యకారులు క్షేమంగా వారి ఇంటికి చేరుకోనున్నారు.

ఇకనుంచి మత్స్యకారులు గూగుల్ నావిగేషన్ ను సరిగ్గా చూసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉండగా… కాకినాడలో నీటి ప్రవాహం అధికంగా పెరుగుతోంది. సముద్రపు అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. రోడ్లపైన అటువైపుగా వెళ్లే వాహనాదారులు కెరటాల దాటికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా సముద్రంలో నీటి ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అధికంగా కురిసే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.