తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణరావు చేతులెత్తేశారు. వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో..? లేదో..? తెలియదు.. నేను మళ్లీ గెలుస్తానో..? లేదో తెలియదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణరావు. ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు.

నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు.. అందుకే నేను హామీలు ఇవ్వను అంటూ బాంబ్ పేల్చారు. నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తానని వెల్లడించారు మంత్రి జూపల్లి కృష్ణరావు. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి జూపల్లి కృష్ణరావు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
బ్రేకింగ్ న్యూస్
చేతులెత్తేసిన జూపల్లి!
వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో..? లేదో..? తెలియదు.. నేను మళ్లీ గెలుస్తానో..? లేదో తెలియదు!
ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా… pic.twitter.com/h2eANDSOZp
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2025