తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే.. తాజాగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఈ తరుణంలోనే ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇచ్చారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం క్యూలో నిల్చోని వేచి చూశారు సత్యవతి రాథోడ్.

తన సొంత గ్రామం పెద్దతాండలో తనకున్న ఐదున్నర ఎకరాల భూమికి యూరియా కోసం రాగా, కేవలం ఒక్క బస్తా మాత్రమే ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు సత్యవతి రాథోడ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్
ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇచ్చిన అధికారులు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం క్యూలో నిల్చోని వేచి చూసిన సత్యవతి రాథోడ్
తన సొంత గ్రామం పెద్దతాండలో తనకున్న ఐదున్నర ఎకరాల… pic.twitter.com/edzIifasUE
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2025