యంగ్ హీరో తేజ సజ్జ, కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “మిరాయ్”. ఈ సినిమాలో రితిక నాయర్ హీరోయిన్ గా నటించింది. శ్రియ, మంచు మనోజ్ కీలకపాత్రలను పోషించారు. ప్రభాస్ ఈ సినిమాకు వాయిస్ అందించారు. ఈ సినిమా విడుదలై భారీగా కలెక్షన్లలు రాబడుతోంది. 100 కోట్ల కలెక్షన్ల వైపుగా దూసుకుపోతోంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో తాజాగా మిరాయ్ మూవీ టీం సక్సెస్ మీట్ ను నిర్వహించారు.

ఇందులో భాగంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. అంతే కాకుండా హీరో తేజ సజ్జాకు, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి లగ్జరీ కారు గిఫ్ట్ గా ఇస్తానని పేర్కొన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో మూవీ యూనిట్ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాతో తేజ సజ్జ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పొచ్చు.