ఏపీలో కొద్ది రోజుల నుంచి ఉల్లిపాయలు, టమాటాల ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రైతులు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన న్యాయం ప్రభుత్వం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్రంలో బంతిపూల ధరలు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. బంతిపూలకు వినాయక చవితి సమయంలో ధర బాగానే ఉండేది.

వినాయక చవితి సమయంలో కిలో బంతిపూల ధర 50 నుంచి 60 రూపాయలు పలకగా ఇప్పుడు కిలో బంతిపూల ధర భారీగా పడిపోయింది. కేజీకి రూ. 10 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల రైతులు రోడ్లపైనే బంతులను పడేస్తున్నారు. కనీసం కిలోకు 35 నుంచి 40 రూపాయలు వస్తే పెట్టుబడి అయినా వచ్చేదని అంటున్నారు. ఇక చాలామంది రైతులు దసరా సీజన్ పైనే వారి ఆశలను పెట్టుకున్నారు. దసరా సమయంలోనైనా బంతిపూలకు గిట్టుబాటు ధర కలగాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంపైన నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.