సిరిసిల్లాలో కలెక్టర్ సందీప్ వర్సెస్ ఆది శ్రీనివాస్ ప్రోటోకాల్ పంచాయితీ కొనసాగుతోంది. ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రోటోకాల్ పంచాయితీ CMOకు చేరింది.. ప్రజా పాలన వేడుకలకు ప్రభుత్వం తరపున అతిథిగా పాల్గొన్నారు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ తరుణంలోనే…ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అవమానం ఎదురైంది. ఆది శ్రీనివాస్ ప్రసంగం లేకుండానే వేడుకలను ముగించారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

పంద్రాగస్టు రోజు కూడా జెండా ఆవిష్కరణకు అతిథికి స్వాగతం పలకలేదు కలెక్టర్, ఎస్పీ. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను పట్టించుకోకుండానే.. కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలోనే… సీఎస్, సీఎంఓ కు ఫిర్యాదు చేశారు ఆది శ్రీనివాస్. దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు CMO. ఈ తరుణంలోనే… సిరిసిల్లాలో కలెక్టర్ సందీప్ పై వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.