ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా 1300 గిఫ్టులను వేలం వేయనున్నారు. ప్రధాని మోడీకి చాలామంది అభిమానులు పంపిన బహుమతులను వేలం వేస్తూ ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజున ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 1300 పైగా వస్తువులు ఆన్లైన్లో వేలంలో ఉండబోతున్నాయి. ఈరోజు నుంచి అక్టోబర్ రెండు వరకు ఈ వేలం కొనసాగుతోంది. ఈ వస్తువులను ప్రస్తుతం నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ లో ప్రదర్శనలో ఉన్నాయి.

ఈ గిఫ్టులు కావాలని ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్ ద్వారా వేలంలో పాల్గొనవచ్చని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకవవత్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా…. మరో వైపు ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ తన చేతులమీదుగా మహిళల కోసం ఏర్పాటు చేసిన “స్వస్త్ నారీ సశక్త్ అభియాన్” పేరిట హెల్త్ క్యాంప్ లను ప్రారంభించనున్నారు. ఈరోజు నుంచి అక్టోబర్ రెండు వరకు మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ క్యాంప్ 15 రోజులు పాటు మహిళలకు అందుబాటులో ఉండనుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకొని మందులను పొందవచ్చు.