రైతులకు శుభవార్త… పిఎం కిసాన్ 21వ విడత డబ్బులను కేంద్రం అక్టోబర్ 18న రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 24 దీపావళి పండుగ నేపథ్యంలో అంతకుముందే నిధులను రైతుల అకౌంట్లో జమ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ విషయం పైన అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

కాగా ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు విడతలలో రూ. 6వేలు రైతుల ఖాతాలలో జమ అవుతాయి. ఇందులో రైతులకు ఎకరానికి 6000 ఇస్తారు. మూడు విడతలలో 2000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లలో నిధులను జమ చేస్తుంది. పెట్టుబడి సహాయం కింద పిఎం కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. తెలంగాణలో రైతులకు రైతు భరోసా నిధులు వస్తున్నాయి. దీంతో రైతులు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. సంవత్సరానికి 2 విడతల చొప్పున తెలంగాణలోని రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయి.