విద్యార్థుల‌కు అల‌ర్ట్‌…ఈ నెల 22 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్…!

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఈనెల 22 నుంచి కాలేజీలను మూసేస్తాం అంటూ ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. 16 నెలలుగా ఫీజు బకాయిలు పెట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతున్నామని పేర్కొన్నారు. దాంతో కళాశాలలు నిర్వహించలేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. తొలుత రెండు యూనియన్లు బంద్ నిర్ణయం తీసుకోగా దసరా సెలవుల నేపథ్యంలో ఓ యూనియన్ నిర్ణయాన్ని వాయిదా వేసింది.

college student
college student

ఇదిలా ఉండగా… ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు. అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చి ప్రజలకు లాభం చేకూరే విధంగా చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఏపీలో తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం సక్సెస్ సాధిస్తోంది. మహిళలు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ పొందుతున్నారు. వారి గమ్యస్థానాలకు ఎలాంటి చార్జీలు లేకుండా చేరుకుంటున్నారు. ఈ పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందంటే మరి కొంత మంది పురుషులు ఈ పథకం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బస్ కండక్టర్లు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం వల్ల మహిళలు, పురుషులు వారిపై చాలా దురుసుగా మాట్లాడుతున్నారంటూ మహిళ కండక్టర్లు బాధపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news