తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బస్సులను అధికంగా నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దసరా స్పెషల్ బస్సుల్లో సవరించిన చార్జీలు అమలులో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది. దీంతో టికెట్ల ధర 50% పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈనెల 20, 27 – 30, అక్టోబర్ 1, 5, 6 తేదీలలో నడిచే స్పెషల్ బస్సులలో ఈ సవరణ చార్జీలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. రెగ్యులర్ సర్వీసుల చార్జీలలో మార్పులు ఉన్నాయని ఆర్టీసీ సంస్థ వెల్లడించింది.

2003లో ప్రభుత్వం జారీ చేసిన GO 16 ప్రకారం స్పెషల్ బస్సులకు చార్జీలు సవరిస్తున్నట్లు ఆర్టీసీ గతంలో పలుమార్లు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉండగా… బతుకమ్మ, దసరా పండుగలకు చాలామంది జనాలు వారి సొంత ఊర్లకు చేరుకుంటారు. దీంతో బస్ స్టేషన్లలో భారీగా జనాల రద్దీ పెరుగుతుంది. దీంతో ఆర్టీసీ సంస్థ బస్సులను అధికంగా నడపాలని నిర్ణయం తీసుకుంది. దీంతో జనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన చర్యలను చేపడుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకొని మరిన్ని బస్సులను అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.