తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గత కొద్ది రోజుల నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో జల్లులతో కూడిన వర్షాలు కురవగా మరికొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో రాబోయే మరో రెండు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

నేడు ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, నంద్యాల, పల్నాడు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణలోని కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మిగతా ప్రాంతాలలో జల్లులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈదురు గాలులు బలంగా వీచే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.