తెలుగు రాష్ట్రాలలో కాలేజీలు, స్కూళ్లకు దసరా సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఇచ్చారు. తిరిగి మళ్ళీ 3వ తేదీన స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ చేస్తామని వెల్లడించారు. అయితే ఈ విషయం పైన కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగ 2వ తేదీన ఉంది సొంత ఊర్లకు, బంధువుల ఇంటికి తిరిగి వెళ్ళినవారు మరుసటి రోజు తెల్లవారుజామున ఎలా స్కూళ్లకు, కాలేజీలకు వస్తారంటూ విద్యార్థి సంఘాలు పలు రకాలుగా ప్రశ్నిస్తున్నారు.

4వ తేదీ వరకైనా సెలవులను పెంచాలని డిమాండ్లు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇచ్చారు. తిరిగి 4వ తేదీన స్కూళ్లు యధావిధిగా ప్రారంభమవుతాయని విద్యార్థులు తరగతి క్లాస్ లకు హాజరు అవ్వాలని పేర్కొన్నారు. ఈ విషయం పైన విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరి స్కూళ్లకు, కాలేజీలకు మరికొన్ని రోజులపాటు సెలవులను పొడిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.