తన గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక…!

-

ఇప్పుడు తెలుగులో రష్మిక మందన హవా కొనసాగుతుంది. ఆమె వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అగ్ర హీరోలతో సినిమాలు చేసి వరుస హిట్స్ కొడుతుంది. ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే తనకు అసలు సినిమాల్లో నటించాలి అని లేదట. ముందు జర్నలిజం లోకి వెళ్ళాలి అనుకుని జర్నలిజం చదివాను అని చెప్పింది రష్మిక.

ఇది నూటికి నూరుపాళ్ళు నిజమని.. చదివింది జర్నలిజమే అయినా, ఆ రంగంకన్నా సినీ రంగమే నన్ను ఎక్కువగా ఆకర్షించిందని చెప్పుకొచ్చింది. ఊహ తెలిసినప్పటినుంచీ నటనమీద ఆసక్తి పెరిగిందని వివరించింది. నేరుగా నటిని కావాలంటే సాధ్యం కాదు కనుక మోడలింగ్‌లోకి అడుగుపెట్టానని వివరించింది. మోడల్‌గా పలు ఉత్పత్తులకు పనిచేసిన తరువాతే నాకు అవకాశాలు రావడం మొదలయ్యాయని చెప్పింది.

నటించడానికి వచ్చిన ప్రారంభంలో నా ముఖాన్ని ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారో లేదో తెలియదని చెప్పింది. ప్రయత్నం చేద్దాం అని సినీ జీవితాన్ని ప్రారంభించానన్నారు. అలా తొలి చిత్రమే విజయాన్ని అందించిందని గుర్తు చేసుకుంది. ఆ తరువాత వరుసగా అవకాశాలు ముంగిట వచ్చి వాలుతున్నాయని… అయితే ఇలా వేగంగా ఎదిగి, వెంటనే పడిపోకూడదని… అందుకే ప్రతి చిత్రాన్నీ చాలా జాగ్రతగా ఎంపిక చేసుకుంటున్నానని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news