కడప జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ దివంగత నాయకులు పరిటాల రవి హత్య కేసులో నిందితులకు బెయిల్ వచ్చింది. దీంతో మరికాసేపట్లో కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు పరిటాల రవి హత్య కేసులో ఉన్న నలుగురు ముద్దాయిలు. పరిటాల రవి హత్య కేసులో మొత్తం 12 మందికి శిక్ష పడిన సంగతి తెలిసిందే.
వారిలో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. గత ఆరు నెలల క్రితం బెయిల్ పై ముగ్గురు…విడుదలయ్యారు. ఇక నేడు కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు పరిటాల రవి హత్య కేసులో ఉన్న నలుగురు ముద్దాయిలు. కడప సెంట్రల్ జైలు నుంచి నారాయణ రెడ్డి, ఓడి రెడ్డి, రంగనాయకులు, ఒడ్డే కొండా విడుదల కానున్నారు. అటు విశాఖ జైలు విడుదల కానున్నారు రేఖమయ్య.