బిజినెస్ ఐడియా: వెల్లుల్లి పంటతో ఏకంగా పది లక్షలు…!

-

మీరు ఏదైనా బిజినెస్ ని చేయాలనుకుంటున్నారా..? ఆ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. వీటి ద్వారా లక్షల్లో ఆదాయం పొందొచ్చు. చాలా మంది ఈ మధ్య కాలం లో ఉద్యోగాల కంటే వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం చేస్తూ మంచిగా సంపాదిస్తున్నారు.

 

సాంప్రదాయ పంటల కంటే కూడా వాణిజ్య పంట కి డబ్బులు ఎక్కువ వుంది. అలాంటి వాటిలో వెల్లుల్లి ఒకటి. అయితే మరి వెల్లుల్లి ఎలా పండించాలి..? వెల్లుల్ని ఎలా సాగు చెయ్యాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మీరు వెల్లుల్లి పంటను పండించి కేవలం ఆరు నెలల్లోనే పది లక్షలు సంపాదించవచ్చు. చాలా మంది రైతులు వెల్లుల్లి సాగు చేస్తున్నారు. ఏడాది పొడుగునా కూడా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది.

మనం నిత్యం వంటల్లో వెల్లుల్లిని వాడుతూనే ఉంటాం అలానే మందుల్లో కూడా వెల్లుల్లిని వాడతారు. వెల్లుల్లిని పౌడర్, పేస్ట్, చిప్స్ తో సహా చాలా ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇక దీనిని ఎలా పండించాలి అనేది చూస్తే… వెల్లుల్లి సాగుకు వానాకాలం అనుకూలం కాదు. వానా కాలం పూర్తయిన తర్వాత దీని సాగును ప్రారంభించాలి.

వెల్లుల్లి మొగ్గలను వేస్తె వెల్లుల్లి పండుతుంది. 10 సెంటి మీటర్ల దూరం లో మొక్కలు నాటాలి. మీరు కనుక ఎక్కువ నిలిచిపోయింది అంటే పంట దెబ్బతింటుంది. ఒక ఎకరం భూమిలో 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది ఒక క్వింటాళ్ల వెల్లుల్లి ధర పది వేల నుంచి 20 వేల వరకు పలుకుతోంది. రకాన్ని బట్టి కూడా డిమాండ్ ఉంటుంది. రియా వన్ రకం వల్ల లాభాలు ఎక్కువ వస్తాయి. రియా వన్ తో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version