ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..ఎన్నో వేల ఎకరాల్లొ పంటలు నీటిలో ఉండి పోయాయి.మన రాష్ట్రంలో 18 సుమారుగా 20 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు వేసిన పత్తి ప్రస్తుతం కాయ మొదటి తీత దశలో ఉంది.ఇప్పుడు వేసిన పత్తికి కాయలు వచ్చే దశ.అధిక వర్షాల వల్ల కాయకుళ్ళు తెగులు ఉధృతి ఉండే అవకాశం ఉన్నందున ఈ తెగులు యొక్క లక్షణాలు అనుకూలమైన పరిస్థితులు గురించి వివరించడం జరిగింది..
పత్తి పంట కాయ దశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు పడటం వలన అనేక రకాలైన శిలీంద్రాలు ఆశించడం వల్ల కాయలు కుళ్ళిపోతాయి. శిలీంధ్రాలలో ముఖ్యంగా కొల్లేటోట్రైకమ్ గోసిసి, డిప్లోడియా గోసిసి, అస్కోకైటా గోసిసి మరియు ఫ్యూజేరియం జాతికి సంబంధించిన శిలీంధ్రాలు ఆశించడం వల్ల పత్తి కాయలు కుళ్లి పోతాయి. అదేవిధంగా కొన్ని బ్యాక్టీరియా జాతికి చెందినవి కూడా కాయలను ఆశించడం వలన కాయలు కుళ్ళిపోతాయి. పురుగులు, కాయలను ఆశించడం వలన కాయల మీద ఏర్పడిన రంధ్రాల ద్వారా లేదా అంతరకృషి, యంత్రాలు వివిధ చర్యల ద్వారా కాయల మీద ఏర్పడిన గాయాలు లేదా సహజంగా కాయలు పగిలినప్పుడు వివిధ రకాలైన శిలీంద్రాలు కాయలోనికి ప్రవేశించి తెగులును కలుగజేస్తాయి.
అదేవిధంగా కాయ పెరిగే దశలో కాయలు అంటుకొని ఉన్న పూలరేకులు ఎక్కువ రోజులు తేమను నిలుపుకునే పరిస్థితి ఉంటుంది కనుక ఈ పరిస్థితుల్లో అనేక రకమైన శిలీంద్రాలు ఆశించి అవకాశం ఎక్కువగా ఉంటుంది.. ఫంగస్ శిలీంద్రాల వల్ల కలిగే కాయకుళ్ళులో కాయలపై బూజుని గమనించవచ్చు. కాయలు కుళ్ళి పోవడం వల్ల కాయలో ఉన్న దూది రంగు కూడా మారిపోయి నాణ్యత మరియు దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది..
పత్తి పంట కాయ పెరిగే దశలో ఉన్నప్పుడు అధిక తేమతో కూడిన వాతావరణంలో ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. మబ్బులతో కూడిన చల్లని వాతావరణం, ఎడతెరిపిలేని వర్షాలు తక్కువ ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఈ దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది.వివిధ రకాలైన పురుగులు ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, కాయతొలుచు పురుగులు గాయాలతో ఉన్న కాయల వల్ల వర్షాలు కురుస్తున్నప్పుడు వర్షాల నీరు రంధ్రాల నుండి కాయ లోపలికి ప్రవేశించి వివిధ రకాలైన శిలీంద్రాలు కాయను పూర్తిగా కుళ్ళిపోయెలా చేస్తాయి..వెంటనే రైతులు గమనించి వ్యవసాయ నిపునుల సలహా తీసుకోకుంటే మాత్రం తీవ్ర నష్టాన్ని చూసే అవకాశం ఉంది..