ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సమీర్ శర్మ గారు సమీక్ష నిర్వహించారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
చాతిలో నొప్పి రావడంతో కుర్చీలోంచి కింద పడినట్లు సమాచారం అందుతుంది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది ఆయనను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవలే సిఎస్ సమీర్ శర్మకు హార్ట్ సర్జరీ అయిన సంగతి తెలిసిందే.