స్వీట్ కార్న్ సాగులో పాటించవలసిన మెళకువలు..

-

తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా స్వీట్ కార్న్ సాగును చేస్తున్నారు..మార్కెట్ లో మొక్క జొన్నకు డిమాండ్ తగ్గడం, ఎంత శ్రద్ద వహించిన కూడా దిగుబడి రాకపోవడంతో రైతులు వేరే పంటల వైపు మొగ్గు చూపిస్తున్నారు.తక్కువ వనరులను ఉపయోగించుకొని, తక్కువ సమయంలో కోతకు వచ్చే తీపి జొన్న సాగు చేపట్టినట్లయితే గింజ దిగుబడితో పాటు రైతు అదనపు ఆదాయం రాబట్టవచ్చు.

 

ఈ పంట సాగులో తీసుకొవాల్సిన మెలుకువలు..

పూత మొదలైనప్పటి నుండి 40 రోజుల తర్వాత పంటకోత చేపట్టవచ్చు. పూత మొదలైనప్పటి నుండి గింజ గట్టిపడే దశ వరకు గడలో చక్కెర శాతం ఎక్కువగా వుంటుంది. కాబట్టి ఈ దశలో కోత చేపట్టినట్లయితే 1 హెక్టారుకు ఇథనాల్ సంగ్రహించే శాతాన్ని పెంచవచ్చు.పంటను కోసిన 48 గంటల లోపు ఇథనాల్ సంగ్రహణ మిల్లులకు చేర్చగలగాలి. లేనిచో ఇథనాల్ దిగుబడి తగ్గే ఆస్కారముంటుంది.చెరకు నుండి ఇధనాల్ సంగ్రహణకు వాడే డిస్టిల్లరి యూనిట్స్ తీపిజొన్న నుండి ఇథనాల్ సంగ్రహణకు వాడవచ్చును.

స్వీట్ కార్న్ ఉపయోగాలు..

వీటి నుంచి ఇథనాల్ సంగ్రహణలో ఎలాంటి పర్యావరణ కాలుష్యం ఉండదు.భారత ప్రభుత్వం జారి చేసిన నిబంధనల ప్రకారం 5% ఇథనాల్న పెట్రోల్ లో కలపవచ్చు. ఇప్పటివరకు చెరుకు నుండి మాత్రమే ఇథనాల్ను సంగ్రహించేవారు. కాని శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం తీపిజొన్న నుండి కూడా ఇధనాలు సంగ్రహించవచ్చు. అంతేకాకుండా తీపిజొన్న నుండి 1 లీటరు ఇధనాల్ సంగ్రహణకు పట్టే ఖర్చు (రూ॥13/-) చెరకు నుండి ఇథనాల్ సంగ్రహణకు పట్టే ఖర్చు (రూ॥16/-) కంటే కూడ తక్కువ. 1 హెక్టారు తీపి జొన్న గదల నుండి 2000-2500 లీటర్ల ఇధనాల్ను ఉత్పత్తి చేయవచ్చు.

తీపి పదార్థం ఉండటం వల్ల బెల్లం, చక్కెర తయారీలో కూడా దీన్ని వాడుతారు.కేకులు, బిస్కెట్లు, బెల్లం, సిరప్లను తయారు చేయవచ్చు.చెరకు పంట తో ఈ పంటకు తక్కువ నీరు అవసరం అందుకే స్వీట్ కార్న్ ఈజిగా సాగు చేయవచ్చు..తక్కువ నీటితో తక్కువ వనరులతో తీపి జొన్న సాగు చేపడితే రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version