గల్లీ బాయ్స్ కమెడియన్ రియాజ్ పెళ్లి ఫోటోలు వైరల్..!!

-

సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది ప్రతిభావంతులు బాగా వెలుగులోకి రావడం జరిగింది. ఇక పలువురు సెలబ్రిటీస్, సామాన్యులు సైతం కూడా తమలోని టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా బయట పెడుతూ ఇండస్ట్రీలో స్టార్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో గల్లీ బాయ్స్ ఫేమ్ రియాజ్ కూడా ఒకరు. యూట్యూబ్ వీడియోలను చేస్తూ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత బుల్లితెర మీద సద్దాం తో కలసి పలు కామెడీ షో లు కూడా చేశారు. కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది.

ప్రస్తుతం స్టార్ మా, కామెడీ స్టార్స్ వంటి ప్రోగ్రాంలో చేస్తున్నారు రియాజ్. ఇక వీర పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని చెబుతూ ఉంటాడు. సోషల్ మీడియా వేడుకలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. ఈ క్రమంలో రియాజ్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతుంది .అది ఏమిటంటే రియాజ్ వివాహం చేసుకున్నట్టుగా పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రియాజ్ వివాహం నజీర్ అనే అమ్మాయితో ఎంతో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే రియాజ్ పెళ్లికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో నే ఒక వార్త వచ్చింది.. అప్పుడు కూడా రియాజ్ పెళ్లి ఫోటోలు వైరల్ గా మారాయి.. ఆ ఫోటోలను బిగ్ బాస్ ఫేమ్ ఆషు రెడ్డి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసింది. దీంతో పెళ్లిరోజు శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఈ సందర్భంగానే ఆషు రెడ్డి ఇలా మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రియాజ్, నజీరా అంటూ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోని షేర్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version