చాలామంది యువతీ యువకులు ముఖం పై రంధ్రాలను తొలగించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. అందుకోసం మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతుంటారు. వీటి వల్ల అవి తగ్గకపోగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ముఖం పై రంధ్రాలు, మొటిమల్ని గిల్లడం వలన ఒత్తిడి వలన, డీహైడ్రేషన్ వలన, పోషకాహార లోపం వలన సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకునేందుకు మన ఇంట్లో దొరికే నాచురల్ పదార్ధాలని వాడితే ముఖం అందంగా అవుతుంది.
ఓట్ ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగించడంలో తోడ్పడుతుంది. ఇంకా అలాగే పెరుగులో కూడా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రంధ్రాలను బిగుతుగా చేసి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఇక ఈ ఫేస్ ప్యాక్ కోసం రెండు స్పూన్ ల ఓట్స్‌లో ఒక చెంచా పెరుగును కలిపి పేస్ట్ లాగా చేయండి. ఇప్పుడు ఫేస్ పై ఈ పేస్ట్ ని ముఖం పై అప్లై చేసి 10- 15 నిముషాలు ఉంచి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై రంధ్రాలు ఇంకా జిడ్డు చర్మం తొలగిపోతుంది.అలాగే తేనెలో యాంటీబాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ముఖ రంధ్రాలు తొలగించడంలో సహాపడతాయి. ఇంకా అలాగే నిమ్మకాయలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇది జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది. పంచదార ముఖంపై ఉన్న మురుకిని తొలగిస్తుంది.
ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్లు చక్కెర, కొంచె తేనె ఇంకా రెండు చెంచాల నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత కొంచెం సేపటి తరువాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి చేస్తే ముఖం పై రంధ్రాలు ఈజీగా తగ్గిపోతాయి.అలాగే టమోటాలో విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ , లైకోపీన్, అనే కణాలు అధికంగా ఉంటాయి. ఇవి ముఖంపై జిడ్డు చర్మాన్ని ఈజీగా తొలగిస్తాయి. టమోటా గుజ్జుని తీసుకొని ముఖంపై అప్లై చేసి ఒక 15 నిముషాలు పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ముల్తాని మట్టి కూడా జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది. ముల్తాని మట్టిని తీసుకొని అందులో రోజ్ వాటర్‌ని కలపి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 10 నిముషాలు పాటు ఉంచాలి. ఆతర్వాత సాధారణ నీటితో కడిగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై రంధ్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి.