రోజ్‌ వాటర్‌ను వీటితో కలిపి అసలు వాడకూడదు తెలుసా..?

-

చర్మసంరక్షణలో భాగంగా చాలా మంది రోజ్‌ వాటర్‌ను వాడుతుంటారు. బ్యూట్‌ టిప్స్‌ కోసం వేసుకునే ప్యాక్స్‌లో కూడా రోజ్‌ వాటర్‌ను యాడ్‌ చేస్తారు. అయితే అది అన్నింట్లో కలపడకూడదని సౌందర్య నిపుణులు అంటున్నారు. కొన్నింటితో కలిపి దీన్ని ముఖానికి వాడకూడదు. దాని వల్ల చర్మానికి హాని చేస్తుంది. అవేంటో తెలుసుకుందాం..

రోజ్ వాటర్ ఎలా వాడాలి?

కొన్ని చుక్కలు రోజ్ వాటర్ ఒక దూది ఉండమీద వేసుకుని ముఖానికి రాసుకోవచ్చు. అ తరువాత క్లెన్సర్ లేదా ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి. మేకప్ పూర్తయ్యాక కూడా రోజ్ వాటర్‌ను స్ప్రే లాగా వాడొచ్చు. లేదా సింపుల్ ఫేస్ ప్యాక్ లాగా ముఖానికి రోజ్ వాటర్ రాసుకుని కాసేపాగి కడిగేసుకోవచ్చు.

వీటితో కలపకూడదు:

ఎసెన్షియల్ నూనెలతో:

కొన్ని రకాల ఎసెన్షియల్ నూనెలతో కలిపి ముఖానికి రాసుకుంటారు. కొంతమందికి మాత్రమే ఇది నప్పుతుంది. కానీ ఆస్తమా, లేదా వాసనకు సంబంధించిన ఎలర్జీలున్నా, డెర్మటైటిస్ ఉన్నా చర్మం దురద లేదా ఇంకేమైనా సమస్య రావచ్చు. అందుకే ఇవి రెండూ కలిపి వాడకపోవడమే మంచిదని సౌందర్య నిపుణులు అంటున్నారు.

నిమ్మరసంతో:

నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, యాక్నె సమస్య తగ్గిస్తుంది. కానీ దీన్ని కూడా రోజ్ వాటర్‌లో కలిపి వాడితే ఎక్కువ ప్రయోజనాలుండవు. చర్మాన్ని రక్షించే పీహెచ్ స్థాయులు మారి దురద, దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. రోజ్ వాటర్ ఒకటే వాడినా మంచి ఫలితాలుంటాయి. అవగాహన లేకుండా దాన్ని వేరే పదార్థాలతో కలపడం వల్ల చర్మానికి హాని జరుగుతుంది.

బేకింగ్ సోడాతో:

బేకింగ్ సోడాకు సహజ యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ముఖానికి రాసుకుంటే బ్యాక్టీరియా తగ్గించి యాక్నె సమస్య తగ్గొచ్చు. కానీ రోజ్ వాటర్ కలపడం వల్ల చర్మం పీహెచ్ స్థాయులు మారిపోయి చర్మం మరింత పొడిగా, సున్నితంగా మారుతుంది.

వెనిగర్‌తో:

కేవలం వెనిగర్ వాడటం వల్ల యాక్నె, మచ్చలు తగ్గుతాయి. రోజ్ వాటర్‌కో కలిపి వెనిగర్ వాడితే చర్మం పీహెచ్ మారి, కొత్త సమస్యలు రావచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version