దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలి : మంత్రి కోమటిరెడ్డి

-

కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు. ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోయాడు నా ఛాలెంజ్ కు స్పందించి కేసీఆర్ బయటికి రావడం నాకు సంతోషంగా ఉంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ తడాఖా తెలిసింది. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదు. నాలాంటి వాళ్లు పదవి త్యాగం చేయడం వల్ల తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ కల సహకారం అయింది. దొంగ దీక్షలు చేయడం కేసీఆర్ కు అలవాటు. నేను కొడితే మీ పార్టీ కూడా లేవదు. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలి అని సవాల్ విసిరారు మంత్రి.

అలాగే ప్రభాకర్ రావు, శ్రావణ్ లు ఇండియాకు రావద్దని కేసీఆర్ చెప్పాడు. పదేళ్ల BRS హయంలో జరిగిన అభివృద్ధి.. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా.. బీఆర్ఎస్ చేసిన అప్పులకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అప్పులు కడుతుంది. కేసీఆర్ భయపెడితే.. భయపడే వాళ్ళు ఎవరూ లేరు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుందాం అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version