ముఖంపై ముడుతలను గుడ్డుతో సులభంగా తగ్గించండి.!

-

చర్మంపై ముడతలు వచ్చాయంటే.. మీ ఏజెడ్‌ లుక్‌ బయటపడిపోతుంది. వయసురీత్యా చర్మంపై ముడతలు రావడం సహజం, కానీ కొందరికి 30 ఏళ్లకే ముడతలు రావడం స్టాట్‌ అవుతాయి. ఇది మరీ దారుణం..అందుకే వాటిని కవర్‌ చేయడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. చర్మంలోని ముడతలను తొలగించడంలో గుడ్లు బాగా సహాయపడుతాయి. గుడ్లు పోషకాల భాండాగారం. మాంసకృత్తులు పుష్కలంగా ఉండే గుడ్లు చర్మం ఎలాస్టిసిటీని కాపాడతాయి. ముఖం కాంతివంతంగా మృదువుగా చేయడానికి గుడ్లు కూడా సహజ మార్గం. ముఖంపై ముడతలను పోగొట్టడానికి కొన్ని గుడ్డు ఫేస్ ప్యాక్‌లను తెలుసుకుందాం.

 

గుడ్డులోని తెల్లసొనను బాగా కొట్టిన తర్వాత, అందులో ఒక టీస్పూన్ ఆరెంజ్ జ్యూస్ మరియు అర టీస్పూన్ పసుపు వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఒక గుడ్డులోని తెల్లసొన, ఒక టీస్పూన్ నిమ్మరసం మరియు అర టీస్పూన్ తేనె కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

గుడ్డులోని తెల్లసొనను బాగా కొట్టిన తర్వాత, దానికి ఒక టీస్పూన్ తేనె మరియు ఓట్స్ జోడించండి. తర్వాత బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు నాలుగు రోజులు చేయండి. ముడతలు క్రమంగా తగ్గుతాయి.

ఒక గుడ్డులోని తెల్లసొనలో ఒక టీస్పూన్ కాఫీ పొడి మరియు అర టీస్పూన్ తేనె వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.

ఒక గుడ్డులోని తెల్లసొన, ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ తేనె మరియు ఒక టీస్పూన్ దోసకాయ రసం తీసుకుని బాగా కలపాలి. తర్వాత దీన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే ముఖంపై ముడతలను సహజంగా తొలగించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version