నిత్యం యవ్వనంగా ఉండాలంటే ఈ చిన్న పనులు చేస్తే చాలు..!

-

యవ్వనంగా కనిపించాలంటే ఏవేవో క్రీమ్స్‌, థెరపీలు చేయించుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఇవేం చేయకుండా సరైన లైఫ్‌ స్టైల్‌ను పాటిస్తే చాలు. వయసు మీద పడుతున్న కొద్దీ ముఖంలో తేడాలు వస్తాయి. వాటిని ఆపలేం కానీ పోస్ట్‌పోన్‌ చేయొచ్చు. 50, 60 ఏళ్ల వయస్సులో కూడా తమ కంటే కొన్ని దశాబ్దాలు తక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల వలే కనిపిస్తారు. పెరిగే వయసును ఆపలేనప్పటికీ శక్తివంతంగా చురుకుగా యవ్వనంగా ఉండొచ్చు. అలా ఉండాలంటే జీవనశైలి అలవాట్లే ఏకైక మార్గం.

క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ చురుకుగా ఉండటం, నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం, ఒత్తిడి తగ్గింపు కోసం మైండ్‌ఫుల్‌నెస్ సాధన చేయడం మొదలైన అంశాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని చెప్పారు. యవ్వనంగా కనిపించడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, మొత్తంగా మీ శ్రేయస్సును పెంచడానికి దీర్ఘాయువుతో జీవించటానికి ఆరోగ్య నిపుణులు కొన్ని జీవనశైలి అలవాట్లు సూచించారు. అవేంటంటే..

రెగ్యులర్ వ్యాయామం
హృదయ ఆరోగ్యం, మొత్తం ఫిట్‌నెస్ కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. హృదయ వ్యాయామాలు, శక్తి శిక్షణ రెండింటినీ చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.

సమతుల్యమైన ఆహారం
వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తినండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర స్నాక్స్‌లను పరిమితం చేయండి.

నాణ్యమైన నిద్ర
ప్రతి రాత్రి 7-9 గంటలు డిస్టబెన్స్‌ లేకుండా నిద్రపోవటం అలవాటు చేసుకోండి. మీ గదిలో అనుకూలమైన నిద్ర వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి. స్థిరమైన నిద్ర దినచర్యను ఏర్పాటు చేయండి.

ఒత్తిడి నియంత్రణ
ధ్యానం లేదా మీకు నచ్చిన కార్యకలాపాలలో ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేయండి. ప్రభావవంతమైన ఒత్తిడి నియంత్రణ పద్ధతులను ప్రాక్టీస్ చేయండి. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే అన్ని చర్యలు తీసుకోండి.

బలమైన సామాజిక సంబంధాలు
కుటుంబం, స్నేహితులతో బలమైన సామాజిక సంబంధాలను పెంచుకోండి. ఏదైనా సమస్య ఉంటే కుర్చోని మాట్లాడుకోండి. అక్కరకానీ పంతాలు, కోపాలతో మైండ్‌ కరాబ్‌ చేసుకోకండి. మానసికంగా ఉత్తేజపరిచే కార్యకలాపాలు, అభిరుచులలో పాల్గొనండి.

ఇలా మీ లైఫ్‌స్టైల్‌ను ప్లాన్‌ చేసుకుంటే హ్యాహీగా అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version