మొటిమలు, నల్లమచ్చలు పోగొట్టడానికి జామ ఆకు చేసే మేలు..

-

సిట్రస్ ఫలమైన జామ చేసే మేలు గురించి అందరికీ తెలిసిందే. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. జామ పండు మాత్రమే కాదు జామ చెట్టు ఆకులు కూడా శరీరాన్ని ఆరోగ్యాన్ని అందిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా చర్మ సంరక్షణకి జామ చేసే మేలు గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. మొటిమలు, మచ్చలు, అక్కడక్కడా చర్మం రంగు వేరేలా ఉండడం వంటి సమస్యల నుండి దూరం కావాలంటే జామ ఆకు పేస్ట్ తయారు చేసుకుంటే సరిపోతుంది.

జామ పండు లో వలే జామ ఆకులో కూడా పొటాషియం, ఫోలిక్ ఆమ్లం తగిన పాళ్ళలో ఉంటాయి. ఇవి చర్మానికి రక్షణ కలిగిస్తాయి. జామ చెట్టు ఆకుల్లో గాలిక్ ఆసిడ్, ఆస్కార్బికామ్లం కూడా ఉంటాయి. ఇంకా చర్మ కణాలను రిపేర్ చేసే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

జామ ఆకుల పేస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు

లేత జామ ఆకులు
కొన్ని నీటి చుక్కలు

తయారీ విధానం

ఈ రెండింటినీ మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.

అప్లై చేసుకునే విధానం

ముందుగా గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత జామ ఆకు పేస్ట్ ని ముఖంపై మర్దన చేసుకోవాలి. అది పూర్తిగా ఎండిపోయిన తర్వాత చల్లని నీటితో శుభ్రపర్చుకుంటే చాలు.

ఐతే మీది సున్నితమైన చర్మం అయితే గనక ముందుగా టెస్టింగ్ కోసం అప్లై చేసి చూడండి. ఆ తర్వాతే వాడాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోండి.

ఈ విధానాన్ని వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version