అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్లు.. ధ‌ర‌లు ఎలా ఎన్నాయంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు షియోమీ.. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో 3 నూత‌న స్మార్ట్ ఫోన్ల‌ను గురువారం భార‌త మార్కెట్‌లో విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 10, నోట్ 10 ప్రొ, నోట్ 10 ప్రొ మ్యాక్స్ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ధ‌ర‌లు కూడా త‌క్కువ‌గానే ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 10 ఫీచ‌ర్లు…

* 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 678 ప్రాసెస‌ర్‌
* 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్‌, 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 13 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్
* ఐపీ 52 వాట‌ర్ రెసిస్టెంట్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రెడ్‌మీ నోట్ 10 ప్రొ, నోట్ 10 ప్రొ మ్యాక్స్ ఫీచ‌ర్లు…

* 6.67 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 × 2400 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 732జి ప్రాసెస‌ర్
* 6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్
* రెడ్‌మీ నోట్ 10 ప్రొ – 64, 8, 2, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* రెడ్‌మీ నోట్ 10 ప్రొ మ్యాక్స్ – 108, 8, 2, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* ఐఆర్ సెన్సార్‌, ఐపీ 52 వాట‌ర్ రెసిస్టెంట్‌, డ్యుయ‌ల్ 4జి వీవోఎల్‌టీఈ
* డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5020 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

రెడ్‌మీ నోట్ 10 స్మార్ట్ ఫోన్ ఫ్రాస్ట్ వైట్, ఆక్వా గ్రీన్‌, షాడో బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర రూ.11,999గా ఉంది. అదే 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ అయితే రూ.13,999 ధ‌ర‌కు ల‌భిస్తుంది. అమెజాన్ తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను మార్చి 16 నుంచి విక్ర‌యిస్తారు. దీనిపై ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.500 వ‌ర‌కు డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.

రెడ్‌మీ నోట్ 10 ప్రొ, నోట్ 10 ప్రొ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు వింటేజ్ బ్రాంజ్‌, గ్లేషియ‌ల్ బ్లూ, డార్క్ నైట్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల‌య్యాయి.

రెడ్‌మీ నోట్ 10 ప్రొకు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.15,999గా ఉండ‌గా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.16,999 గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.18,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 17 నుంచి విక్ర‌యిస్తారు.

రెడ్‌మీ నోట్ 10 ప్రొ మ్యాక్స్ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.18,999గా ఉంది. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.19,999గా ఉండ‌గా, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర రూ.21,999గా ఉంది. ఈ ఫోన్‌ను మార్చి 18 నుంచి విక్ర‌యిస్తారు. ఈ ఫోన్ల‌పై ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1500 వ‌ర‌కు డిస్కౌంట్‌ను అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version