14 ఏళ్ల లోపు పిల్లలకు మొటిమలు వస్తున్నట్లైతే.. డైట్ లో ఈ మార్పులను చేయండి..

-

చర్మ ఆరోగ్యం ఎంతో మెరుగైన విధంగా ఉండాలంటే రోజు తీసుకునే ఆహారం కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది అనే చెప్పవచ్చు. ముఖ్యంగా టీనేజ్ లో మొటిమలు, మచ్చలు వంటి ఎన్నో చర్మ సమస్యలను పిల్లలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొంత శాతం పిల్లలకు 8 నుండి 14 వయసులోనే ప్రారంభం అవుతున్నాయి. అలాంటి సమయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా పిల్లలు రోజు తీసుకునే ఆహారం లో మార్పులను తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సహజంగా చర్మం పై వచ్చే మొటిమలు, మచ్చలు హార్మోన్ల అసమతుల్యత వలన వస్తాయి. అయితే శరీరంలో హార్మోన్లు తీరు సరైన విధంగా లేకపోవడం వలన సీబం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో చర్మ రంధ్రాలను సీబం అడ్డుకొని ముఖం పై మచ్చలు ఏర్పడతాయి.

అంతేకాకుండా కొంత శాతం మంది పిల్లలకు జుట్టులో చుండ్రు రావడం వలన మొటిమలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే జుట్టుకు సంబంధించి కూడా సరైన జాగ్రత్తలను తీసుకొని చుండ్రు వంటి సమస్యలను తగ్గించుకోవాలి. చర్మ ఆరోగ్యం బాగుండాలి అంటే చాక్లెట్లు, కేకులు వంటివి అస్సలు ఇవ్వకూడదు. పిల్లలు సహజంగా చెక్కర ఉండేటువంటి ఆహార పదార్థాలని ఇష్టపడుతూ ఉంటారు. అయితే వాటిని తీసుకోవడం వలన శరీరంలో ఇన్సులిన్ ను పెంచుతాయి.

దీంతో చర్మ ఆరోగ్యం ఎంతో దెబ్బతింటుంది మరియు మొటిమలు, మచ్చలు వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. దీంతోపాటు అధిక కార్బోహైడ్రేట్లు ఉండేటువంటి బ్రెడ్ ను కూడా అస్సలు తినకూడదు. తరచుగా బ్రెడ్ ని తీసుకున్నా ఇన్సులిన్ పెరుగుతుంది. కాఫీలో ఉండే కెఫైన్ శరీరాన్ని డిహైడ్రేట్ చేస్తుంది. దీంతో చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక పిల్లలు కాఫీని తీసుకోకపోవడమే మేలు. అధిక చక్కర ఉండేటువంటి పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటిని పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. వీటిని తీసుకోవడం వలన హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది దీంతో చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది.

Read more RELATED
Recommended to you

Latest news