బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడితో అదిరే లాభాలు మోడీ ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది…!

Join Our Community
follow manalokam on social media

మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ బాగుంటుంది. దీని కోసం మీరు పెద్దగా పెట్టుబడి కూడా పెట్టలేదు. తక్కువ పెట్టుబడి తో చాలా బిజినెస్లు ఉన్నాయి అయితే వాటిలో ఒక మంచి బిజినెస్ ఐడియానే ఈరోజు మీకు అందిస్తున్నాము. దీని కోసం మీ దగ్గర ఐదు వేల రూపాయలు ఉంటే చాలు. అంతే కాదు ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది.

చాలా మందికి టీ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా మట్టి గ్లాసు లో చేసిన దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రైల్వే స్టేషను దగ్గర బస్టాండ్ దగ్గర లేదంటే విమానాశ్రయాల దగ్గర కూడా ఈ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఈ ఛాయ్ ని అమ్మితే డబ్బులు బాగా వస్తాయి. ప్రభుత్వం కూడా దీనిని ప్రమోట్ చేయాలనుకుంటుంది.

నేటి కాలం లో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. వాటిని బ్యాన్ చేసి ఇటువంటి వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలని మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ అన్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ఈ ఛాయ్ కి ఎక్కువ ప్రాముఖ్యత వస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఈ బిజినెస్ కోసం స్కీమ్ ను కూడా తీసుకొచ్చింది. మట్టి గ్లాసులో టీ చేసి ఇవ్వడం కూడా బాగుంటుంది. స్థానికంగా కుండలు, మట్టి పాత్రలు తయారు చేయడానికి ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ప్లాస్టిక్ వంటి వాటిని బ్యాన్ చెయ్యాలని కేంద్రం ఉద్దేశ్యం.

డిమాండ్ కి తగ్గట్టు గా భారీగా మట్టి గ్లాసులు తయారు చేయాలని ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సంస్థను ఆదేశించారు.

ఐదువేల తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు:

దీని కోసం మీకు ఐదు వేల రూపాయలు ఉంటే స్టార్ట్ చేయవచ్చు. దీనివల్ల మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడున్న రేట్లు బట్టి చూస్తే మట్టి కప్పులకి యాభై రూపాయలు. అదే లస్సి కప్పు అయితే 150 రూపాయలు ఉంటుంది. పాలకి వంద రూపాయలు రూపాయలు నుండి 150 వరకు అవుతాయి. టీ ని మీరు 15 నుండి 20 రూపాయలకి అమ్మచ్చు. ఒకవేళ బిజినెస్ బాగా అయితే మీకు రోజుకి 1000 రూపాయలు దాక వస్తాయి.

TOP STORIES

కరోనా సెకండ్ వేవ్: యువతలో కనిపించే 6 అసాధారణ లక్షణాలివే..!

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సామాన్య ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా...