బిజినెస్ ఐడియాస్: నెలకి ముప్పై వేలుకి పైగా పచ్చళ్ళ వ్యాపారంతో సంపాదించచ్చు..!

మీరు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా…? అయితే మీకోసం ఇక్కడ ఒక బిజినెస్ ఐడియా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడిని పొందాలనుకునే వాళ్ళు ఈ ఐడియాని ఫాలో అవ్వొచ్చు. పైగా ఈ బిజినెస్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం మీ ఇంట్లో కూర్చుని మీరు ఈ వ్యాపారాన్ని చేయొచ్చు. తక్కువ పెట్టుబడి పెట్టి నెలకి 30 వేల రూపాయల వరకు మీరు సంపాదించవచ్చు. అదే పచ్చళ్ళ బిజినెస్.

చాలా మందికి పచ్చడి లేకపోతే ముద్ద దిగదు. అందుకనే దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు. రుచికరమైన పచ్చళ్లు తయారు చేసి క్వాలిటీగా మీరు బిజినెస్ చేస్తే ఖచ్చితంగా మంచి రాబడి పొందొచ్చు. అయితే దీని కోసం మీరు పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. కేవలం పది వేల రూపాయలతో మొదటి పెట్టుబడి పెడితే సరిపోతుంది. దీంతో 25 వేల రూపాయల నుంచి 30 వేల వరకు ప్రతి నెలా పొందొచ్చు. అయితే మీ పచ్చళ్ళకి డిమాండ్ ఉంటే డబ్బులు వస్తాయి. అయితే వ్యాపారం మొదలు పెట్టడానికి మీరు పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు.

ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ మీకు సహాయం చేస్తుంది. అయితే ఈ బిజినెస్ మీరు చేయాలంటే మీకు 900 స్క్వేర్ ఫీట్ స్థలం ఉండాలి. అలాగే కొంచెం ఓపెన్ స్పేస్ ఉండాలి. పచ్చళ్లు తయారు చేయడానికి, ఎండబెట్టటానికి, ప్యాకింగ్ చేయడానికి అవసరం పడుతుంది. అలాగే ఎక్కువ కాలం పచ్చళ్ళు పాడైపోకుండా ఉంచాలంటే చాలా శుభ్రత పాటించాలి.

అలానే ఎక్కువకాలం ఉంచుకోవచ్చు. దీని కోసం మీకు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుండి లైసెన్స్ అవసరం. అలానే కొన్ని పద్ధతులను ఫాలో అయ్యి మీరు ఈ బిజినెస్ ని డెవలప్ చేసుకోవచ్చు. మీరు మీ చుట్టుపక్కల ఉండే షాపులకు సప్లై చేయొచ్చు లేదా ఆన్లైన్ లో కూడా మీరు ఈ బిజినెస్ చేయొచ్చు ఇలా మీ వ్యాపారాన్ని విస్తరించుకుని మంచి లాభం పొందండి.