వరంగల్ బీసీ రాజకీయ యుద్ధభేరి సభలో DMK ఎంపీ విల్సన్ కీలక కామెంట్స్ చేసారు. వరంగల్ సభ బీసీ డిక్లరేషన్ కు వేదిక కావాలి. జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి మీకున్న సమస్య ఏంటి.. మీ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు కదా.. పక్కనున్న మా రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాం. అందులో 50 శాతం బీసీలకే ఇస్తున్నాం. సామాజిక, కులగణన ద్వారా వచ్చిన లెక్కల ప్రకారం తక్షణమే రిజర్వేషన్ అమలు చేయాలి. ఓట్లు మనవే.. సీట్లు మనవే అనే మీ నినాదం చాలా గొప్పది. 10 శాతం EWS రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మిగతా వారికి ఎందుకు ఇవ్వరు.
కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్… వన్ ఎలక్షన్ అంటుంది, కామన్ సివిల్ కోడ్ తెస్తానంటుంది. కానీ కామన్ రిజర్వేషన్ అమలు చేయడం లేదు. కచ్చితంగా దీనిపై కొట్లాడుదాం.. ఢిల్లీలో అందరం కలిసి పోరాడుదాం. నేను తమిళనాడులో న్యాయస్థానాన్ని ఆశ్రయించి 50 శాతం రిజర్వేషన్ సంపాదించుకున్నా. భారతదేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తమిళనాడు రాష్ట్రం నెంబర్ వన్. తమిళనాడులో EWS రిజర్వేషన్ అమలు చేయడం లేదు. అగ్రవర్ణాలు ఆల్రెడీ విద్య, ఉద్యోగాలలో ముందంజలో ఉన్నారు అని విల్సన్ అన్నారు.