బిజినెస్ ఐడియా: మునగ పంటను సులభంగా పండించి.. లక్షల్లో లాభాలను పొందొచ్చు..!

-

ఎక్కువ మంది ఈ మధ్య కాలం లో వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఉద్యోగాల కంటే కూడా వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా..? దానితో మంచిగా డబ్బులను పొందాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియాని కనుక ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

 

ఈ మధ్య కాలం లో చాలా మంది యువత వ్యవసాయం వైపు మక్కువ చూపిస్తున్నారు. గ్రామాల్లో పంటలను పండిస్తున్నారు. దీంతో చక్కటి లాభాలను కూడా వాళ్లు పొందుతున్నారు. లక్షల్లో లాభాలు వస్తున్నాయి. అయితే ఎక్కువ రాబడిని ఇచ్చే వాటిలో మునగ సాగు కూడా ఒకటి. మునగకాడలకు మంచి డిమాండ్ ఉంది.

ఆరోగ్యానికి ఇవి ఎంతో బాగా ఉపయోగపడతాయి పైగా మంచి రుచితో వుంటాయి కాబట్టి అందరికీ నచ్చుతాయి. దీనికి ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర పలుకుతోంది ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా సాగు చేస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే బంజరు భూముల్లో కూడా దీనిని సాగు చేయొచ్చు. తక్కువ ఖర్చు అవుతుంది పైగా మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా చేయక్కర్లేదు.

ఈ పంట తో నెలకి 50 వేల వరకు సంపాదించుకోవచ్చు. సంవత్సరానికి ఆరు లక్షల వరకూ సంపాదించుకోవడానికి అవుతుంది. వర్షాలు ఎక్కువ పడిన తక్కువ పడిన సరే దీనికి ఇబ్బంది కలగదు. ఎలాంటి వాతావరణ పరిస్థితి అయినా దీనికి సెట్ అవుతుంది.

ఏడాదికి రెండు సార్లు కాపుకొస్తాయి. ఏడాది పొడుగునా ఒక్క మొక్క నుంచి 200 నుంచి 400 కాడలు వస్తాయి. అయితే మునగకాడలు ముదురుపోకుండా చూసుకోవాలి. సరైన సమయానికి కాడల్ని కోసేసి అమ్మేస్తూ ఉండాలి. ఇలా మునగ సాగు కనుక చేసారంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version