బిజినెస్ ఐడియా: గాడిదలను కాస్తూ లక్షల్లో ఆదాయం..!

-

సాధారణంగా ఆవులని గేదెలని పెంచుతూ ఉంటారు. కానీ ఇది చాలా వెరైటీగా ఉంది తెలంగాణకి చెందిన ఒక వ్యక్తి గాడిదలను పెంచుతున్నాడు. గాడిదలని కాస్తూ నెలకి లక్షల్లో డబ్బులను సంపాదిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే… తెలంగాణకి చెందిన ఒక యువకుడు గాడిదలను కాస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం వెల్దండ గ్రామానికి చెందిన అఖిల్ గాడిదల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు.

తెలంగాణలో మొట్ట మొదటిసారి అఖిల్ గాడిదల ఫార్మ్ ని స్టార్ట్ చేశాడు. మాములుగా ఎవరైనా కుందేళ్ళను కానీ కోళ్లను కానీ లేదంటే ఆవులనో గేదెలానో పెంచుతూ వుంటారు కానీ ఇతను మాత్రం గాడిదలని పెంచుతున్నాడు. గాడిదల ద్వారా బిజినెస్ చేసేందుకు కారణం గాడిద పాలకి వున్న డిమాండ్ ఏ. సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని వీడియోలు చూసి ఈ బిజినెస్ ని తాను చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఒక గాడిద కోసం సుమారు 60 నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తం గాడిదల కోసం అఖిల్ రూ. 1.50 లక్షలు ఖర్చు పెట్టాడు. ఈ పాలు లీటర్ రూ. 4500 నుంచి 5 వేల వరకు ఉంటుంది. తమిళనాడు నుంచి కూలీలను పెట్టి గాడిదలను పెంచుతున్నాడు. ఒక్కోసారి ఐడియా వెరైటీగా వున్నా సరే లాభాలు బాగుంటాయి. పైగా ఆ వ్యాపారం మీద మీకు పట్టు లేకున్నా ఈజీగా ఇప్పుడు ఇంటర్నెట్ లో నుండి తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news