మా మధ్య ఏమీ లేదు మీరే కొట్టుకు చస్తారు..!!

-

కమెడియన్ అలీ మరియు  పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్ పవన్‌ కళ్యాణ్‌.. అలీ కూతురు వివాహానికి గైర్హాజరు కావడంతో తీవ్ర చర్చకు దారి తీసింది. మొదటి నుండి ప్రతి అలీ కి చెందిన ప్రతి ఫంక్షన్ లో ఉండే పవన్ ఈ ఫంక్షన్ లో లేకపోయే సరికి అందరూ పవన్ కళ్యాణ్, ఆలీ స్నేహం పై అనుమాన పడ్డారు.

ముందు నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహ బందం వుంది.పవన్ కళ్యాణ్ నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో అలీ కోసం ప్రత్యేక మైన పాత్ర ఉంటుంది. కథ లో స్కోప్ లేక పోయినా కూడా కనీసం ఎక్కడో ఒక చోట ఇరికిస్తారు. షూటింగ్ అయిపోయిన తరువాత కూడా వారి మధ్య మంచి సరదా సంభాషణ జరుగుతుంది. వారి మధ్య బంధాన్ని కాటమరాయుడా ఫంక్షన్ వీడియో లో కూడా మనం చూడొచ్చు.

ఎన్నికల సమయంలో  పవన్ జనసేన ద్వారా పోటీ చెస్తే అలీ వైసీపీ పార్టీకి ప్రచారం చేశారు.అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత అలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈ కారణంతోనే పవన్‌కు, అలికి మధ్య విబేధాలు వచ్చాయని పెద్ద ఎత్తున షికార్లు చేశాయి.ఈ విషయమై  అలీ క్లారిటీ ఇచ్చారు. ‘రామోజీ ఫిల్మిం సిటీలో షూటింగ్‌ సమయంలో పవన్‌తో పాటు చిత్ర యూనిట్ అందరికీ శుభలేఖ ఇచ్చాను. అయన కూడా వివాహానికి వస్తాను అని చెప్పారు.కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో అయన రాలేకపోయారు. మళ్లీ ఇంటికి వచ్చి కలుస్తా అని చెప్పారు దీనిలో వివాదం ఏమి లేదని అలీ క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news