బిజినెస్ ఐడియా: నల్ల పసుపుతో లాభాలే లాభాలు.. పండించేటప్పుడు ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు..!

-

ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది వ్యాపారం చేయడానికి ఇష్ట పడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ బిజినెస్ ఐడియా కి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

 

రైతులకి నల్ల పసుపు బాగా లాభాలని తీసుకు వస్తోంది. నల్ల పసుపు లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ధర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పంట పండిస్తే రైతులకు కోట్ల లో లాభాలు వస్తాయి. నల్ల పసుపు మొక్క కూడా సాధారణ పసుపు మొక్క లాగే ఉంటుంది కానీ ఆకుల మధ్య నల్లని గీతలు ఉంటాయి.

దుంపల లోపల నుంచి పసుపు రంగులో కాకుండా నలుపు లేదా ఉదా రంగు లో ఉంటాయి. ఒక హెక్టారు పొలంలో రెండు క్వింటాళ్ల నల్ల పసుపు విత్తనాలు ని మీరు నాటాల్సి వస్తుంది. ఈ పంటకు నీటి ని పారించాల్సిన పనిలేదు. అలానే కెమికల్స్ వంటివి కూడా ఉపయోగించాల్సిన పని లేదు. కీటకాల బాధ ఉండదు. మీరు కేవలం ఆవుపేడతో తయారు చేసిన ఎరువును ఉపయోగిస్తే సరిపోతుంది. మార్కెట్లో దీని ధర కిలోకు 60 నుంచి 100 వరకు పలుకుతుంది.

అదే నల్ల పసుపు అయితే 500 నుంచి 1000 వరకు వెళుతుంది. దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది. ఒక ఎకరం లో నల్ల పసుపు సాగు చేస్తే యాభై నుంచి అరవై క్వింటాళ్ల పసుపు వస్తుంది. బాగా ఎండాక 12 నుండి 15 క్వింటాళ్లు ఎండు పసుపు ఈజీగా మనకి వస్తుంది. కిలో కి వెయ్యి నుంచి నాలుగు వేల వరకు కూడా అమ్ముకోవచ్చు. ఎలా చూసుకున్నా నల్ల పసుపు తో లక్షల్లో లాభాలు పొందొచ్చు. కొందరైతే కోట్లలో లాభాలు పొందుతున్నారు. చూసారు కదా ఈ బిజినెస్ ఐడియాని. దీన్ని ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు వస్తాయి ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version