జాబ్ చేసి డబ్బులను ఆదా చెయ్యడం కష్టమే.. అందుకే చాలా మంది బిజినెస్ లను చేస్తూ మంచి లాభలను పొందుతున్నారు.. అయితే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభలను పొందే బిజినెస్ లు చాలానే ఉన్నాయి..ఒక మంచి బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి జనవరి నెల ఉత్తమమైనది. ఈ సమయంలో మీరు పచ్చి బఠానీల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంలో మీరు ఖర్చు కంటే చాలా రెట్లు ఎక్కువ లాభం పొందుతారు. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది..
మన దేశంలో ఫుడ్ కు మంచి డిమాండ్ ఉంది.. బఠానిల వ్యాపారం చెయ్యాలనుకుంటే మంచి లాభాలను పొందుతారు. మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెట్లో తక్కవ ధరకు దొరికినప్పుడు కొని.. ఎక్కవ డిమాండ్ ఉన్నప్పుడు బిజినెస్ చేయాలి. ఈ బఠానీ బిజినెస్ ఎప్పుడు మొదలు పెట్టాలి..? ఏ సమయంలో బఠానీలు తక్కువ ధర ఉంటుంది.. అయితే ఏ నెలలో బఠాణిలు ఎక్కువ ధర ఉంటాయి. ఏ నెలలో తక్కువ ధర ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి.మీరు తాజా బఠానీలను తీసుకొని చలికాలంలో వాటిని కోల్డ్ స్టోరేజీలో సరిగ్గా నిల్వ చేయాలి. దీనికి జనవరి నెల ఉత్తమమైనది.. ఎందుకంటే ఈ సమయంలో బఠానీలు ఎక్కువగా మార్కెట్‌లోకి వస్తాయి. చౌక ధరలకు లభిస్తాయి. మీరు పచ్చి బఠానీలను మార్కెట్ నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేయవచ్చు. మీరు 300 నుంచి 500 చదరపు అడుగుల స్థలంలో మీ ఇంట్లో ఒక భాగంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు..
రాబోయే రోజుల్లో దీని డిమాండ్ మరింత పెరగనుంది. ఫ్రోజెన్ బఠానీలను హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ స్టాల్స్, ఇళ్లలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. మంచి లాభాలను పొందవచ్చు..పచ్చి బఠానీలు కిలో రూ.20 చొప్పున మార్కెట్‌లో పెద్దమొత్తంలో దొరుకుతున్నాయి. కానీ ఫ్రోజెన్ పచ్చి బఠానీల వ్యాపారం కోసం మీకు చాలా బఠానీలు అవసరం. అందుకే పచ్చి బఠానీలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తే కిలో రూ.10-12 చొప్పున సులభంగా లభిస్తాయి. ప్రాసెస్ చేయబడినప్పుడు.. మీరు ఈ బఠానీలను కిలోకు రూ.100-120 చొప్పున పెద్దమొత్తంలో విక్రయించవచ్చు. నేరుగా దుకాణంలో విక్రయిస్తే కిలోకు రూ.200 వరకు ధర లభిస్తుంది… మంచి లాభాలను పొందవచ్చు.. మీకు ఆసక్తి ఉంటే మీరు కూడా ఈ బిజినెస్ ను స్టార్ట్ చెయ్యండి..