కొత్త రేషన్ కార్డుల జారీపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో ఉన్న విధంగా కాకుండా ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అర్హుల ఆదాయ పరిమితి గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలుగా ఉంది. దాన్ని మరో రూ.10-20 వేల వరకు పెంచుతారని సమాచారం. ఈనెల 30న జరిగే తెలంగాణ కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.