బిజినెస్ ఐడియా: ఉద్యోగాన్ని వదిలేసి మరీ వ్యాపారం.. ఇప్పుడు నెలకి డబ్భై వేలు..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. వ్యాపారం చేసి మంచిగా సంపాదించుకోవాలని కార్పొరేట్ జాబ్ ని కూడా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. తాజాగా బెంగళూరు లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాన్ని వదిలేసి బిజినెస్ మొదలు పెట్టాడు సాయి. నెలకు ఇరవై రెండు వేల జీతం వస్తున్న సరే ఆ ఉద్యోగాన్ని వదిలి 5 వేల పెట్టుబడితో ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నాడు.

మార్కెట్లో ఆర్గానిక్ ఉత్పత్తులు ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నాడు.సేంద్రియ పద్దతి లో పండించిన మామిడి పండ్ల ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో షేర్ చేసి బిజినెస్ ని అలా మొదలు పెట్టాడు. ఫార్మ్ టు హోమ్ డెలివరీ చేసే వాడు కూడా. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది రైతులకు కూడా సహాయం చేశాడు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు నుండి కూడా కస్టమర్లు ఉన్నారు.

వంకాయ, కాలిఫ్లవర్. టొమాటో తో చేసిన పచ్చళ్ళు అలాగే ఇతర పచ్చళ్లను కూడా తయారు చేసి సాయి సరఫరా చేస్తున్నాడు. చాలామంది సేంద్రీయ పద్ధతిలో పండించే పద్ధతుల్ని ఇష్ట పడుతున్నారు వీళ్లు కూడా సేంద్రీయ పద్ధతిలో పండించే వాటినే అమ్ముతూ ఉంటారు. పచ్చళ్ళని రుచికరంగా తయారు చేస్తూ మంచిగా వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. ఇందులో 20 మంది మహిళలు కూడా ఉపాధి కల్పించి వాళ్లకి జీతాలు ఇస్తున్నారు. మొత్తం ఖర్చులు పోను 70 వేల వరకు సంపాదిస్తున్నాడు. ఉద్యోగాన్ని వదిలేసుకుని జీతం కంటే కూడా మూడు రెట్లు డబ్బుల్ని సంపాదిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version