బిజినెస్ ఐడియా: పెరటి చేపల పెంపకంతో లాభాలే లాభాలు…!

ఉద్యోగం అంటే మీకు ఇష్టం లేదా..? ఏదైనా వ్యాపారం ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే కచ్చితంగా మంచిగా రాబడి వస్తుంది. అదే పెరటి చేపల పెంపకం. మరి ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాల్లోకి వెళితే…

Fish Farming; Cultivation; Fish Pond Preparation | Agri Farming

చేపల పెంపకం ద్వారా ఇంటి పరిసరాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. అదే విధంగా ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్రెష్ గా కూడా కూర్చోవచ్చు. ఎంతో హాయిగా గడపవచ్చు. సాధారణంగా సిటీలో టౌన్ లలో చేపలను అక్వేరియం లో పెడతారు అవి చూడడానికి అందంగా ఉంటాయి.

అయితే పల్లెటూర్లలో చక్కగా పెరటి చేపల పెంపకం మొదలు పెడితే చూడడానికి అందంగా ఉంటుంది పైగా ఆదాయం కూడా బాగుంటుంది. దీనికోసం మీరు చిన్నపాటి చెరువు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. మీరు పెరట్లోనే కాదు వీలైతే మేడ మీద కూడా చేపల్ని పెంచుకోవచ్చు.

దీని కోసం కొలను చేయించుకోవాల్సి వస్తుంది. కనీసం లోతు 1 నుంచి 1.5 మీటర్లు ఉండాలి. 10 నుండి 15 సెంటీమీటర్లు పొడవు గల ఒక చేపకు కనీసం యాభై లీటర్ల నీళ్లు ఉండాలి. చెట్ల నీడ ఉంటే మంచిది. కానీ చెట్ల కింద గుంత ఉండకూడదు ఎందుకంటే గుంతలో నీళ్లు కలుషితమవుతాయి. చెరువు నిర్మించడానికి మీకు పిండిచేసిన రాయి ఇసుక సిమెంట్ లాంటివి అవసరమవుతాయి.

ఇన్లెట్ మరియు అవుట్లెట్ పైపులైను పెట్టాల్సి ఉంటుంది. చేపల్లో చాలా రకాలు ఉంటాయి మీరు మీకు నచ్చిన రకాలని పెంచుకోవచ్చు. మార్కెట్ లో చేపల కి మేత కూడా దొరుకుతుంది దానిని ఉదయం సాయంత్రం అందించాలి ఇలా మీరు చేపల పెంపకం తో మంచిగా సంపాదించొచ్చు.