కాంగ్రెస్ పార్టీ కీలక నేత గులాంనబీ ఆజాద్ ఆపార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ పనితీరుపై పలువురు కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. వీరిలో ఆజాద్ కూడా ఒకరు. తాజాగా జమ్మూ కాశ్మీర్ పూంచ్ లో జరుగుతున్న ఓ ర్యాలీలో ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఆశాజనకంగా లేదని…2024 లో కాంగ్రెస్ 300 సీట్లు సాధించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ 300 సీట్లు సాధించాలని దేవుడిని కోరకుంటున్నా అన్నారు. నేను ఇప్పుడు ఏ పార్టీ రాజకీయాల్లోకి వెళ్లడం లేదని..ఏ పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడటం లేని ఆజాద్ అన్నారు.
మరోవైపు ఆర్టికల్ 370పై కూడా ఆజాద్ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్ట్ మాత్రమే నిర్ణయం తీసుకోగలదని.. ఆ తరువాత అధికారం కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నవాటిని రాష్ట్రాలుగా మారుస్తారు కానీ.. బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిందని విమర్శించారు. ఇది డీజీపీని , ఎస్ హెచ్ ఓగా మార్చిన విధంగా ఉందని విమర్శించారు.