కమ్మకులం వేలేసినా… నాకు నష్టం లేదు : కొడాలి నాని

నారా చంద్రబాబు భార్య భువనేశ్వరి పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వైసీపీ నేతలను ఉద్దేశించి… టీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఫైర్‌ అవుతున్నారు. అయితే… ఈ నేపథ్యంలోనే… నిన్న నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు వల్లభనేని వంశీ. అయితే… భువనేశ్వరికి క్షమాపణలు చెప్పడానికి మాత్రం.. మంత్రి కొడాలి నాని ముందుకు రాలేదు. తాను క్షమాపణలు చెప్పడం కాదని… తనకే.. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్నారు కొడాలి నాని.

”నాకు , జగన్మోహన్ రెడ్డి గారికి కులం అనేది ఏదీ లేదు , నమ్మిన వారి కోసం నిలబడడమే మా కులం… నన్ను ఎవరో కొందరు కమ్మ కులం నుండి వెలి వేసినంతమాత్రాన నాకు వచ్చిన నష్టమేమీ లేదు… దేశంలో ఉన్న కొన్ని వందల కులాలలో ఒక కులం నన్ను వెలివేస్తే… మిగిలిన కొన్ని వందల కులాలు నావే.. వారందరూ నా వారే” నని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ విషయంలో తాను అస్సలు తగ్గబోనని పేర్కొన్నారు కొడాలి నాని.