50 ఉస్మానాబాద్ మేకలతో ఐదు లక్షలు సంపాదించచ్చు..!

-

గొర్రెలలో రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీని వల్ల గొర్రెల పెంపకం చేసే వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. గొర్రెలు ప్రతి ఏడాది ఒక పిల్లని ఇస్తాయి. కానీ మేకలు సంవత్సరానికి రెండు పిల్లలు ఇస్తాయి. అయితే మేకల లో కూడా ఉస్మానాబాద్ మేకల ఎంచుకుంటే మంచిది మన వాతావరణానికి ఈ మేకలు బాగా సెట్ అవుతాయి. ఉస్మానాబాద్ మేకలు అయితే బయటకి పంపించిన మేస్తాయి. లేదా షెడ్లలో వీటిని పెంచినా సరే అవి అలవాటు పడి పోతాయి.

వాటితో ఈ ఇబ్బంది అస్సలు రాదు. అలానే ఉస్మానాబాద్ మేకలు మాంసం కూడా ఇక్కడ ప్రజలు ఇష్ట పడుతూ ఉంటారు. రుచిగా ఉంటుందని ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తుంటారు. ప్రతి సారి కూడా రెండు నుండి మూడు పిల్లల్ని ఈ మేక ఇస్తుంది. రెండు సంవత్సరాల కాలంలో మూడుసార్లు ఈనుతుంటాయి ఇవి. మేక పుట్టిన 11 నెలలకి ఎదకి వస్తుంది.

ఆ తర్వాత ఐదు నెలల కాలం లో మేకనిస్తుంది. అందుకే వీటిని ఎంచుకోవడం మంచిది. త్వరగా పిల్లలు కూడా పుడతాయి. దీంతో మేకలు కూడా ఎక్కువగా ఉంటాయి. లాభం కూడా బాగుంటుంది. అయితే ఎప్పుడైతే మేక ఇలా పిల్లలు పెడుతుందో.. అప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందుతాం కాబట్టి ఇది వేగంగా ఉండేటట్లు చూసుకోవడం మంచిది. 30 మేకలతో మొదలు పెడితే ఆరు నెలల్లో ఇవి యాభై అవుతాయి. మేకలను పెంచేటప్పుడు పిల్లల మేకలని శ్రద్ధగా చూసుకోవాలి. ఇలా మీకు 50 ఉస్మానాబాద్ మేకల ద్వారా ఆదాయం 5 లక్షల వరకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version