టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. తారక్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ పిక్చర్ రూ.1,000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ మూవీతో తెలుగు వారి సత్తాను చాటారు దర్శకుడు రాజమౌళి. ఈ సంగతులు పక్కనబెడితే..రామ్ చరణ్ అప్పుడే తన నెక్స్ట్ ఫిల్మ్ షూట్ లో బిజీ అయిపోయాడు.
ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ – రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న RC15 షూట్ లో పాల్గొంటున్నాడు.ఈ చిత్ర షూటింగ్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో జరుగుతోంది. ఈ నెల 6 నుంచి అక్కడే షూటింగ్ జరుగుతుండగా, షూటింగ్ లొకేషన్ కు రామ్ చరణ్ వచ్చిన క్రమంలో ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. రామ్ చరణ్ ఓపికగా చాలా మందికి సెల్ఫీలు ఇచ్చారు.
శ్రీవెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ ఫిల్మ్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల రామ్ చరణ్ పంచె కట్టులో ఉన్న ఫొటో లీక్ అయింది. అమృత్ సర్ లోని ఓ యూనివర్సటీలో ప్రజెంట్ ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.
రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఈచిత్రంలో కియారా అద్వానీ నటిస్తుండగా, సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్, అంజలి, మాలీవుడ్ యాక్టర్ జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ పిక్చర్ కు స్టోరి కార్తీక్ సుబ్బరాజు అందించారు.