తిరుమల భక్తులకు అలర్ట్…ఇవాళ దర్శనాలకు 15 గంటల సమయం పడుతోంది. తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 16 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 70, 457 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,152 మంది భక్తులు..తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు గా నమోదు అయింది.
ఇక అటు వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన చేసింది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీ షెడ్యూల్ ప్రకటన ప్రకారం….. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో శ్రీవాణి దర్శన టికెట్లు లభ్యం అవుతాయి. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.
- తిరుమల..16 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
- టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 70, 457 మంది భక్తులు
- తలనీలాలు సమర్పించిన 22,152 మంది భక్తులు
- హుండి ఆదాయం 4.16 కోట్లు