నేడు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనుంది కాంగ్రెస్. డా.బి.ఆర్.అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నేడు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ. అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.
కాగా, అంబేద్కర్ పేరు జపించే బదులు.. భగవంతుడి పేరు జపిస్తే… ప్రాప్తి కలుగుతుందని నిన్న పార్లమెంట్ లో అమిత్ షా అన్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై వివాదం తలెత్తింది. దీనిపై షా క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కి వ్యతిరేకమని.. రాజ్యసభలో తాను నిన్న చేసిన వ్యాఖ్యలను వక్రీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేకి, రిజర్వేషన్ల వ్యతిరేకి రాజ్యాంగ వ్యతిరేక పార్టీ.. కాంగ్రెస్ ఏనాడు అంబేద్కర్ స్మారకాన్ని నిర్మించలేదని తెలిపారు.
నేడు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్న కాంగ్రెస్
డా.బి.ఆర్.అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై నేడు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ.
అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని తమ పార్టీ… pic.twitter.com/yaUhQ3aT97
— Telugu Scribe (@TeluguScribe) December 19, 2024