బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ చేస్తే లక్షల్లో ఆదాయం..పెట్టుబడి కూడా చాలా తక్కువే..!

-

బిజినెస్ చేయాలనీ భావించేవారికి బెస్ట్ ఆఫ్షన్..నూనె వ్యాపారం..మార్కెట్ లో నూనెకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంది..పెరిగితే భారీగా పెరుగుతుంది..తగ్గితే 10 లేదా20 రుపాయాలు తగ్గుతుంది.. అందుకే ఈ వ్యాపారం చెయ్యడం చాలా మంచిది.డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి కావడం లేదు. తద్వారా దేశీయంగా నూనె ధరలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఆయిల్ మిల్లు యూనిట్ ఏర్పాటు చేస్తే.. ఆదాయం బాగా వస్తుంది. చిన్న గ్రామం అయిన పట్టణం అయిన కూడా ఈ వ్యాపారం మంచిగా సక్సెస్ అవుతుంది.

యంత్రాలను అమర్చడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. నడపడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. చిన్న స్థలంలోనే చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఈ రోజుల్లో ఆవాలు, వేరుశెనగ, నువ్వులు వంటి అనేక పంటల నుండి నూనెను తీయగలిగే యంత్రాలు మార్కెట్‌లో ఉన్నాయి. ఇందుకోసం మీడియం సైజు ఆయిల్ డిస్పెన్సర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషిన్ 2 లక్షల రూపాయల్లో వస్తుంది. మీరు ఆయిల్ మిల్లును ఏర్పాటు చేయడానికి కొంత పేపర్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆయిల్ మిల్లును పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3-4 లక్షల వరకు ఖర్చవుతుంది. యూనిట్ ప్రారంభించి తొలినాళ్లలో మీరు కాస్త ఎక్కువ కష్టపడాలి..ఏ నూనె తీసినా అది క్వాలిటీగా ఉండాలి. అప్పుడే మీకు కస్టమర్లు వస్తారు. గిరాకీ పెరుగుతుంది. నూనె తీసిన తర్వాత.. దానిని స్థానికంగానే విక్రయించవచ్చు. రిటైల్‌లో విక్రయించడానికి సొంతంగా కౌంటర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కిరాణా దుకాణాలతో ఒప్పందం చేసుకొని.. వారి ద్వారా కూడా అమ్మవచ్చు..లేదు అంటే ఆన్ లైన్ లో కూడా మీరు అమ్ముకోవచ్చు..

నూనెతో పాటు పశుపోషకులకు అవసరమైన ఆవపిండి మొదలైన వాటిని కూడా విక్రయించవచ్చు. తద్వారా మీరు మరింత ఆదాయం పొందుతారు…ఇలా ఏది వేస్టు అవ్వకుండా చేస్తే  మంచి లాభాన్ని పొందవచ్చు.. మీ పెట్టుబడి కూడా వెంటనే వస్తుంది.మీకు ఈ ఐడియా ఉంటే ఇప్పుడే మొదలు పెట్టండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version