బిజినెస్ ఐడియా: నూడిల్స్ బిజినెస్ తో అదిరే లాభాలు..!

-

చాలా మంది ఉద్యోగాల కంటే బిజినెస్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ ఐడియా ని ఫాలో అవ్వండి. దీంతో మీరు మంచిగా ఆదాయం పొందొచ్చు. ఆలస్యమెందుకు ఈ బిజినెస్ ఐడియా (Business Idea) గురించి చూసేయండి.

బిజినెస్ ఐడియా/ Business Idea

నేటి కాలంలో చాలా మంది ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పిజ్జా, బర్గర్ మొదలు నూడిల్స్ వరకు వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత అయితే వీటికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.

అయితే మీరు నూడిల్స్ బిజినెస్ కనుకపెట్టారు అంటే నూడిల్స్ ని తయారు చేసి షాప్స్ కి అమ్మి మంచి ఆదాయం పొందొచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, హోటల్స్, షాపులు నూడిల్స్ ని కొనుగోలు చేస్తారు. నూడిల్స్ తయారీకి మీకు గోధుమ పిండి, పంచదార, స్టార్చ్, ఉప్పు, మసాలా సామాన్లు, సోడియం బైకార్బొనేట్, నూనె వంటివి అవసరం అవుతాయి.

వీటినన్నిటిని మీరు ఒకసారి పెద్దమొత్తంలో కంటే తక్కువకే మీరు కొనుగోలు చేయవచ్చు. నూడిల్స్ తయారు చేయడానికి యంత్రాలు కూడా వస్తున్నాయి. ఈ మిషన్స్ మీ మీరు కొనుగోలు చేసి నూడిల్స్ని తయారు చేయొచ్చు.

40 వేల నుండి మిషన్ ధర ఉంటుంది. అత్యంత నాణ్యమైనవి ఒకటిన్నర లక్షల దాకా ఉంటాయి మీరు మీకు నచ్చిన ఒక యంత్రాన్ని కొనుగోలు చేసి మీకు కావాల్సిన సైజులో నూడిల్స్ ని తయారు చేసుకోవచ్చు. షేప్, డిజైన్ వంటివి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.

అయితే నూడిల్స్ ని కట్ చేశాక ఎండబెట్టి తయారు చేయాలి. చాలామంది యూట్యూబ్లో నూడిల్స్ ని ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నారు. మీరు వాటిని చూసి ఫాలో అయిపోవచ్చు. అయితే దీని కోసం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీసేవ కేంద్రానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.

కంపెనీ పేరు చెప్పి ఆ పేరు పై మీరు ఒక పాన్ కార్డు పొందాలి. నలుగురు కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే లేబర్ సర్టిఫికెట్ కూడా పొందాలి. అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ పొందాలి.

కేంద్ర ప్రభుత్వం ముద్ర స్కీమ్ ద్వారా 50 వేల నుండి 10 లక్షల వరకు లోన్ కూడా ఇస్తుంది. కాబట్టి మీరు డబ్బు విషయంలో కంగారు పడక్కర్లేదు. మీరు మంచి నాణ్యమైన నూడిల్స్ ని షాప్స్ కి సప్ప్లై చేసుకుంటే మీ బిజినెస్ అదే పెరిగిపోతుంది. ఇలా మీరు ఈజీగా నూడిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి మంచిగా డబ్బులు పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version