తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ ఘటనలో టీటీడీతో పాటు కూటమి ప్రభుత్వం వైఫల్యం ఉందని, దీనికి బాధ్యత వహిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు పోలీసులతో పాటు ఇటు టీటీడీ బోర్డుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక మీదట టీటీడీ ఫోకస్ వీఐపీల మీద కాదని,సామాన్య భక్తుల మీద ఉండాలని అన్నారు. ఫస్ట్ ప్రయారిటీ సామాన్య భక్తులే కావాలని స్పష్టంచేశారు. కాగా, నేడు వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమలలో వీఐపీ ఫోకస్ ఎక్కువైంది. దీంతో వీఐపీ దర్శనాల కారణంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.